Revanth Reddy : ఆహా.. నిరుద్యోగులకు ఎంతటి శుభవార్త రేవంత్

తెలంగాణలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2024-02-09 13:29 GMT

తెలంగాణలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. గ్రూప్ వన్ అభ్యర్థుల వయోపరిమితిని పెంచుతున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. గ్రూప్ వన్ అభ్యర్థుల వయోపరిమితిన 46 ఏళ్లకు పెంచుతూ త్వరలోనే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తామని అసెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి కొన్ని నిబంధనల కారణంగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ఆలస్యమయిందని తెలిపారు. తాము గత ప్రభుత్వంలాగా వ్యవహరించమని, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని రేవంత్ హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం లాగా...
బీఆర్ఎస్ పార్టీ నలుగురి ఉద్యోగాలు పోయిన బాధతో రెండు లక్షల ఉద్యోగాల గురించి పదే పదే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము బంధువులను అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం కామని, ప్రతిభ గల వారిని గుర్తించి వారిని ఎంపిక చేసే బాధ్యత టీఎస్‌పీఎస్సీ తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే పదిహేను వేల పోస్టులను పోలీసు శాఖలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News