Revanth Reddy :మరోసారి బీఆర్ఎస్ నేతలకు రేవంత్ సవాల్

నీటిపారుదల అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు

Update: 2025-07-09 13:52 GMT

నీటిపారుదల అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. పబ్ లు, క్లబ్ లలో కాదని ప్రజలు ఎన్నుకున్న శాసనసభలోనే చర్చించాలని కోరారు. బేసిన్లు, భేషజాలు లేవని నాడు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు కృష్ణాజలాల్లో అత్యధికంగా వాటా ఇచ్చారని అన్నారు. దీనిపై అవసరమైతే నాలుగు రోజులు చర్చ పెడదామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను చర్చకు రావాలంటూ సవాళ్లు విసురుతున్నానని అవసరమైతే నీటిపారుదల శాఖపైనాలుగు రోజుల పాటు అసెంబ్లీలో చర్చ పెడదామని, వచ్చిచర్చించాలని కోరారు. గత పదేళ్లు నీటి పారుదల శాఖను కల్వకుంట్ల కుటుంబ సభ్యులే నిర్వహించారని గుర్తు చేశారు.

జగన్ తో లాలూచీ పడి...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో లాలూచీ పడి రాయలసీమకు గోదావరి నీళ్లను తరలించుకు పోవచ్చని, రాయలసీమను రతనాలసీమ చేస్తానని కేసీఆర్ చెప్పింది వాస్తవం కాదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ అనుభవాలు తెలుసుకుందామని తాను సభకు రావాలని కోరానని చెప్పానని అన్నార. జగన్ ను పిలిచి సలహాలు ఇచ్చి జీవోలు వచ్చిందాకా మౌనంగా ఉన్న కేసీఆర్ బ్యాచ్ ఇప్పుడు ఎలా మాట్లాడుతుందని నిలదీశారు. బీఆర్ఎస్ వాళ్లది వితండ వాదమని తెలిపారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చేసిన ద్రోహానికి వంద కొరడా దెబ్బలు కొట్టినా తప్పులేదన్నారు. పాలమూరు రంగారెడ్డి నుంచి రెండు టీఎంసీల నీరు ఎత్తిపోయాల్సి ఉంటే దానిని కేసీఆర్ ఒక టీఎంసీకి తగ్గించింది నిజం కాదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మరణ శాసనం రాసే హక్కు...
కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని ప్రజలకు మరణ శాసనం రాసే హక్కు లేదని రేవంత్ రెడ్డి అన్నారు. నీళ్ల దోపిడీకి తెరలేపింది కేసీఆర్ మాత్రమేనని అన్నారు. అన్నింటికీ తలవొంచి తలూపడంతోనే నేడు ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఏ ప్రాజెక్టును కూడా కేసీఆర్ పదేళ్లలో పూర్తి చేయలేకపోయారన్నారు. చర్చ చేద్దామంటే కేసీఆర్ సభకు రారని అన్నారు. జగన్, కేసీఆర్ ల మధ్య ఏముందో మనకు అనవసరమని, కానీ తెలంగాణకు న్యాయంగా వచ్చే నీటిని చూసీ చూడనట్లు వదిలేసినందునే నేడు హైదరాబాద్ కు కూడా తాగు నీరు అందించలేకపోతున్నామని తెలిపారు. తప్పులన్నీ వాళ్లు చేసి నిందలు నేడు తమపై మోపుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. అనేక ప్రాజెక్టుల్లో ఆయకట్టును కూడా తగ్గించి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారని రేవంత్ రెడ్డి అన్నారు.


Tags:    

Similar News