Chandrababu : రేవంత్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. నీళ్ల విషయంలో రాజకీయాలు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. పోలవరంపై అభ్యంతరం చెప్పడం సరికాదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సముద్రంలో వృధాగా పోయే నీటిని ఎవరైనా వినియోగించుకకోవచ్చన్నారు. కేవలం రాజకీయాల కోసం నీళ్లను వాడుకోవద్దని తెలంగాణను కోరుతున్నానని ఆయన అన్నారు. ఒకరినొకరు పోటీ పడి రాజకీయ ప్రయోజనం కోసం వృధాగా పోయే నీటిని వాడుకోవడానికి అడ్డంకులు కల్పించవద్దని కోరారు. రెండు రాష్ట్రాల మధ్య స్నేహం ఉండాలని,విరోధం పెరిగితే ఇతరులు ఆనందించే పరిస్థితి రాకూడదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలుగు జాతి ఒక్కటేనని అన్నారు.
ప్రజల కోసం రాజకీయాలు చేయడం...
ప్రజల కోసం రాజకీయాలు చేయడం మంచిది కాదని అన్నారు. దేవాదుల, కల్వకుర్తి తానే ప్రారంభించానని, దేవాదులను మరింత ముందుకు తీసుకెళితే తమకు అభ్యంతరం ఏముంటుందని చంద్రబాబు ప్రశ్నిచంారు. గోదవారి నదికి ఎగువువన దేవాదుల ప్రాజెక్టు ఉందని, దేవాదుల నుంచి నీళ్లు వస్తేనే పోలవరానికి నీళ్లు వస్తాయని ఆయన అన్నారు. నాడు మంజీరాకు నీళ్లు తీసుకెళ్లినా తాము అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు గుర్తు చేశారు. నీటిని శ్రీశైలం, సాగర్ లో నిల్వ చేస్తే తెలంగాణ కూడా వాడుకోవచ్చని సూచించారు. రాయలసీమ ఎత్తిపోతల పై చేసిన వ్యాఖ్యల్లో అర్ధం లేదని, అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందని భావిస్తున్నానన్న చంద్రబాబు నాయుడు సముద్రంలోకి వెళ్లే నీటిని అడ్డుకుంటే లాభాలుంటాయి. నష్టాలుంటాయని అన్నారు.