బ్యాంకు కస్టమర్లకు అలెర్ట్.. ఈ రోజు బ్యాంకులు పనిచేయవు

జనవరి నెలలో బ్యాంకు సెలవులు అధికంగా ఉన్నాయి

Update: 2026-01-07 12:32 GMT

Bank holidays in November 2024

జనవరి నెలలో బ్యాంకు సెలవులు అధికంగా ఉన్నాయి. ఆదివారాలు కాకుండా మరో నాలుగు సెలవులు అధికంగా వచ్చాయి. సంక్రాంతి, , గణతంత్ర దినోత్సవానికి బ్యాంకులను మూసివేయనున్నారు. అధికారిక సెలవుల ప్రకారం 2026 జనవరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఎక్కువగానే ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ జనవరి 10న (రెండో శనివారం), జనవరి 24న (నాలుగో శనివారం) బ్యాంకులు మూసివుంటాయి. ఇవి కాకుండా ఆదివారాలు బ్యాంకులకు సెలవు.

జనవరి నెలలో...
జనవరి 14 బుధవారం సంక్రాంతి పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అలాగే జనవరి 26 సోమవారం గణతంత్ర దినోత్సవం కావడంతో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. అదనంగా, తెలంగాణలో జనవరి 1 గురువారం నూతన సంవత్సరం సందర్భంగా బ్యాంకులను ఇప్పటికే ఒకరోజు పనిచేయలేదు. ఈ రోజుల్లో బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవని, అయితే ఆన్‌లైన్, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కస్టమర్లు ముందుగానే తమ లావాదేవీలను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.


Tags:    

Similar News