Kalvakuntla Kavitha : కవితకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న కవిత ఈ నెల 16న అమెరికాకు వెళ్లాల్సి ఉంది. కవిత కుమారుడికి సంబంధించిన డిగ్రీ పట్టా అందుకునే కార్యక్రమంలో ఆమె పాల్గొనాల్సి ఉంది. ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ కల్వకుంట్ల కవిత అమెరికాలో పర్యటించనున్నారు.
అమెరికా పర్యటనలో...
కవిత కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ అమెరికాలో పూర్తికావడంతో కవిత దంపతులు అమెరికా బయలుదేరివెళ్లనున్నారు. ఇందుకోసం తనకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం కవిత అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చింది.దీంతో కవిత అమెరికా పర్యటనకు ఇక గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది.