కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది.

Update: 2025-09-25 05:58 GMT

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఎన్డీఎస్ఏ, ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. ప్రాజెక్ట్ జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారించనుంది. ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యాక ఎఫ్ఎఆర్ నమోదు చేసే అవకాశం ఉంది.కాళేశ్వరంపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభమయినట్లు అధికారులు తెలిపారు.

అవకతవకలపై...
రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలంటూ ప్రభుత్వం సీబీఐకి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసిన నేపథ్యంలో సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌, ఘోష్‌ కమిషన్‌ నివేదికల ఆధారంగా ప్రస్తుతం విచారణ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రాజెక్ట్‌లో అవకతవకలు, నిధులదుర్వినియోగంతో పాటు..అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయనుంది.


Tags:    

Similar News