గూగుల్‌ మ్యాప్స్ సాయం వాగులో కారు

గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మితే ఏమి జరుగుతుందో తెలిపే ఘటన ఇది.

Update: 2025-07-06 12:00 GMT

గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మితే ఏమి జరుగుతుందో తెలిపే ఘటన ఇది. కారు నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి వాగులో పడిపోయిన ఘటన జనగామ జిల్లా వడ్లకొండ సమీపంలో చోటు చేసుకుంది.

మహారాష్ట్రకు చెందిన నలుగురు యువకులు కారులో తిరుపతికి బయలుదేరారు. గూగుల్ మ్యాప్స్‌ ను నమ్ముకుని ప్రయాణం సాగిస్తున్నారు. రాత్రి సమయంలో వీరి వాహనం జనగామ జిల్లా వడ్లకొండ వద్దకు చేరుకోగా, గూగుల్ మ్యాప్ వీరిని నిర్మాణంలో ఉన్న ఓ వంతెన వైపునకు దారి చూపింది. అయితే వంతెన నిర్మాణంలో ఉందని గమనించలేకపోయారు. వేగంగా కారును ముందుకు పోనివ్వడంతో అదుపుతప్పి వంతెన చివరి నుంచి నేరుగా కింద ఉన్న వాగులో పడిపోయింది. అదృష్టవశాత్తు కారు కింద ఉన్న మట్టిదిబ్బపై పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Tags:    

Similar News