Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది.

Update: 2025-10-23 02:36 GMT

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యమైన అంశాలను కేబినెట్ భేటీలో ఆమోదించనున్నారు. మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

స్థానిక సంస్థల ఎన్నికల పై...
హైకోర్టు సూచనల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది. అలాగే నీటి పారుదల ప్రాజెక్టులపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకో్ర్టు తీర్పులపైన, రిజర్వేషన్లపై న్యాయనిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్చించి మంత్రి వర్గ సమావేశం ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశముది. దీంతో పాటు రైతులకు సంబంధించి అంశాలను కూడా చర్చించనుంది.


Tags:    

Similar News