Telangana : ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 12వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్ణయించాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది
ఈ నెల 12వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్ణయించాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పన్నెండో తేదీ నుంచి 27వ తేదీ వరకూ సమావేశాలను నిర్వహించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశాలు ప్రారంభమయిన తర్వాత బీఏసీ సమావేశంలో ఎప్పటి వరకూ సమావేశాలు నిర్వహించాలన్నది నిర్ణయించనున్నారు.
రెండు కీలక బిల్లులు...
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లును పెట్టాలని కూడా మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. ఇక ఉగాది నుంచి భూ భారతిని అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని మంత్రి వర్గ సమావేశం అభిప్రాయపడింది. అలాగే 10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.