KTR : నేడు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై కేటీఆర్‌ సమీక్ష

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు నగరానికి చెందిన నేతలతో సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేటీఆర్ సమీక్ష చేయనున్నారు.

Update: 2025-09-10 04:09 GMT

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కసరత్తులు ప్రారంభించింది. బీజేపీ కూడా ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పై పార్టీ నేతలతో సమావేశమయింది. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమయింది.

అభ్యర్థి ఎంపికపై...
అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు నగరానికి చెందిన నేతలతో సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేటీఆర్ సమీక్ష చేయనున్నారు. అదే సమయంలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఏ విధానాన్ని పాటించాలన్న దానిపై నేతల నుంచి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అంతిమ నిర్ణయం కేసీఆర్ ది అయినప్పటికీ కొన్ని పేర్లను కేసీఆర్ కు ఇచ్చే అవకాశముంది.


Tags:    

Similar News