KTR : వరద సాయం ఎక్కడ? సహాయక చర్యలేవీ?
తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు పడుతున్నా ప్రజల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు పడుతున్నా ప్రజల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలను చేపట్టడంలో విఫలమయిందని చెప్పారు. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్థమవుతున్నప్పటికీ ప్రభుత్వానికి పట్టింపులేదన్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి కనీసం సాయం అందించే పరిస్థితికి కూడా ప్రభుత్వం చేయలేదన్నారు.
సహాయకచర్యలు చేపట్టేందుకు...
అనేక గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకుపోయాయని, కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, వంతెనలు తెగిపోవడం, రహదారులు ఛిద్రమవ్వడంతో ప్రజలు బయటకు వచ్చేందకు కూడా వీలు లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో పడవలను ఉపయోగించి అయినా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం ప్రభుత్వం చేయకపోవడం శోచనీయమని, విద్యుత్తు సరఫరా కూడా అనేక గ్రామాలకు నిలిచిపోయిందని కేటీఆర్ అన్నారు.