KTR : ఆరు గ్యారంటీలు అమలు చేసిన తర్వాత ఓట్లడిగితే బాగుండేది

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు

Update: 2024-05-06 07:13 GMT

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక గ్యారంటీ అమలుచేసి మగాళ్లకు, మహిళలకు మధ్యకొట్లాట పెట్టిందని ఆయన ఉచిత బస్సు ను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానించారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఆయన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరచేతిలో వైకుంఠం చూపెడుతూ మోచేతికి బెల్లంపెట్టినట్లు కాంగ్రెస్ హామీలున్నాయన్నారు.

మరోసారి మోసం చేయడానికి...
ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాయిదాలు వేసుకుంటూ వెళుతుందన్నారు. అబద్ధాలు చెబుతూ ఈఎన్నికల్లోనూ గెలవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. రైతులకు రుణమాఫీ జరగలేదని, అది అడిగితే డెడ్ లైన్లు పెడుతున్నారని, కనీసం రైతు భరోసా నిధులు కూడా అందరికీ అందలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ సమస్యల కోసం ఢిల్లీలో కొట్లాడాలంటే బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అప్పుడే తెలంగాణ శాసించే స్థాయికి ఎదుగుతుందని అన్నారు.


Tags:    

Similar News