Breaking : ఓటమిపై కేటీఆర్ ఏమన్నారో తెలిస్తే?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు

Update: 2025-11-14 08:29 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఎన్నికలు తమకు కొత్త ఉత్సాహాన్నితెచ్చాయన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి తామే ప్రధాన ప్రత్యర్థి అని తేల్చిచెప్పినట్లయిందని కేటీఆర్ అన్నారు. తాము గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయినప్పటికీ ప్రజా సమస్యలపై స్పందించామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చెప్పినట్లయిందని కేటీఆర్ అన్నారు.

చర్చ జరగాలి...
గెలుపు, ఓటములు పక్కన పెడితే ప్రజాస్వామ్యంపై చర్చ జరగాలని అన్నారు. ఈ ఎన్నిక ఎలా జరిగిందన్నది ప్రజల్లో కూడా చర్చ జరగాలన్నారు. ఎన్నికలకు ముందే తాము అనేక విషయాలు బయటకు తెచ్చినా ఎన్నికలకమిషన్ పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని,దొంగ ఓట్లు పోలయ్యాయని చెబుతున్నాఎవరూ తమ మొరను వినలేదన్నారు. ఈ ఓటమితో తాము నిరాశ చెందడం లేదని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వెళతామని కేటీఆర్ చెప్పారు.


Tags:    

Similar News