KTR : కేసీఆర్ కట్టించిన భవనాలకే రేవంత్ ప్రారంభం

మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు

Update: 2025-08-26 02:42 GMT

మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే పథకాల వరద పారిస్తామన్న కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. కేసీఆర్ డెబ్భయి మూడు వేల కోట్ల రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రైతుబంధు పోయిందని, బోనస్‌ బోగస్ అయ్యిందన్నారు.

ఆరు గ్యారంటీలను...
దళితబంధు పథకం కింద పన్నెండు లక్షలు ఒక్కరికైనా ఇచ్చారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదేనా రేవంత్ ప్రభుత్వం తెచ్చిన మార్పు అంటూ ఎద్దేవా చేశారు.ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్‌ఎస్‌ హయాంలో భవనాలు కట్టించామన్న కేటీఆర్ కేసీఆర్ం కట్టించిన భవనాలను రేవంత్‌రెడ్డి ప్రారంభించారన్నారు. కేసీఆర్ పై పై నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని కేటీఆర్ అన్నారు.


Tags:    

Similar News