KTR : మాగంటి సునీతతో కేటీఆర్ భేటీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాగంటి సునీతను కలిశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాగంటి సునీతను కలిశారు. ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కేటీఆర్ కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు, అక్రమాలు చేసినా.. వాటిని ఎదుర్కొని నిలబడి గట్టి పోటీ ఇచ్చిన సునీతను, వారి పిల్లలు చూపిన స్ఫూర్తిని, పోరాటాన్ని కేటీఆర్ అభినందించారు.
వారికి ధైర్యాన్ని చెప్పి...
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేటీఆర్ ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అధికార దుర్వినియోగం, దొంగఓట్లు దెబ్బతీశాయన్న కేటీఆర్ నిత్యం ప్రజల్లో ఉంటే వారు ఖచ్చితంగా ఆదరిస్తారని అన్నారు. ఆ దిశగా ప్రయత్నించాలని, క్యాడర్ కు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు.