KTR : భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలపై కేటీఆర్ కీ కామెంట్స్

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-08-20 11:54 GMT

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమను ఈ ఎన్నికలకు సంబంధించి ఎవరూ సంప్రదించలేదన్నారు. బీఆర్ఎస్ ఏ కూటమిలో లేదని కేటీఆర్ తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థిని తాము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

తమ బాస్ ప్రజలే...
అలాగే బీసీ అభ్యర్థి పేరును ఎందుకు ప్రతిపాదించలేదని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు ఎవరు యూరియా, ఎరువులు ఇవ్వగలిగితే వారికే తమ మద్దతిస్తామని మరో మాటగా ఆయన అన్నారు. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి చర్చించి తీసుకుంటామని చెప్పిన కేటీఆర్, తమకు మోదీ, రాహుల్ గాంధీ బాస్ లు కాదని, తెలంగాణ ప్రజలే బాస్ లని అన్నారు.


Tags:    

Similar News