KTR : లండన్ కు బయలుదేరివెళ్లిన కేటీఆర్

లండన్, అమెరికా పర్యటనకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరి వెళ్లారు.

Update: 2025-05-27 04:46 GMT

లండన్, అమెరికా పర్యటనకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరి వెళ్లారు. ముందుగానే నిర్ణయించుకున్న మేరకు ఆయన ఈరోజు లండన్ కు వెళ్లి తర్వాత అమెరికాకు చేరకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 30వ తేదీన యూకేలోని వార్విక్ యూనివర్శిటీ సైన్స్ -పార్క్ లోని పరిశోధన కేంద్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రారంభించనున్నారు.

డల్లాస్ లో జరగనున్న...
జూన్ 2న అమెరికాలోని డల్లాస్ లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. అనంతరం ఆయన అమెరికా నుంచి బయలుదేరి తెలంగాణకు చేరుకుంటారు. మరొకవైపు ఫార్ములా ఈ రేసు కేసులో ఈ నెల 28వ తేదీన హాజరు కావాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ తాను ముందుగా నిర్ణయించుకున్న విదేశీపర్యటన ముగించుకుని వచ్చి హాజరవుతానని లిఖితపూర్వకంగా తెలిపారు.


Tags:    

Similar News