శాసనసభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్
తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది
తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. స్పీకర్ తీరును నిరసిస్తూ తాము సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రజాస్వామ్యాన్నికాపాడకుండా, ఏకపక్షంగా వ్యవహరించారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద ధర్నా చేశారు.
మాట్లాడేందుకు అవకాశం ఇవ్వని...
తమకు మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో స్పీకర్ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ నుంచి పాదయాత్రగా బీఆర్ఎస్ వరకూ ఎమ్మెల్యేలు వచ్చారు. తాము నిరసనను తెలియజేయాలన్నా అందుకు స్పీకర్ అనుమతించలేదంటూ బీఆర్ఎస్ నేతలు బయటకు వచ్చి మీడియాకుతెలిపారు.