KTR : కేసీఆర్ కు నోటీసులపై కేటీఆర్ స్పందన ఇదీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి నోటీసులు ఇచ్చే పనిలో ఉన్నారన్నారు. దిక్కుతోచని స్థితిలోనే కేసీఆర్ కు నోటీసులు ఇస్తున్నారని కేటీఆర్ అన్నారు. తమకు చట్టం, న్యాయంపై పూర్తి విశ్వాసం ఉందన్న కేటీఆర్ ఇటువంటి నోటీసులకు బెదిరిపోయేది లేదని చెప్పారు.
కమిషన్ల పాలన గా...
ప్రజాపాలన కాస్తా కమిషన్ల పాలన గా మారిందని కేటీఆర్ అన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకూ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. నోటీసులతో భయపెట్టాలనుకోవడం విచారకరమని అన్నారు. ఎన్నినోటీసులు ఎంత మందికి ఇచ్చినా ప్రజాసమస్యలపై తమ ఉద్యమాలు ఆగబోవని హెచ్చరించారు.