Kalvakuntla Kavitha : నా అరెస్ట్ రాజకీయం.. లిక్కర్ కేసులో నాకు సంబంధం లేదు

తన అరెస్ట్ అక్రమమంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె జైలు నుంచి నాలుగు పేజీల లేఖను బయటకు విడుదల చేశారు.

Update: 2024-04-09 13:19 GMT

తన అరెస్ట్ అక్రమమంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె జైలు నుంచి నాలుగు పేజీల లేఖను బయటకు విడుదల చేశారు. రెండున్నరేళ్లలో ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు. తాను తప్పు చేశానని చెప్పడానికి కూడా ఈడీ అధికారుల వద్ద ఆధారాలు లేవని ఆమె లేఖలో స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేక పోయినా అరెస్ట్ చేశారంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ విచారణ కన్నా ఈ కేసులో మీడియా పరిశోధన ఎక్కువగా జరుగుతుందని ఆమె లేఖలో పేర్కొన్నారు.

రాజకీయంగా...
తనను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు, తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. తన మొబైల్ నెంబర్ అన్నింట్లో వేసి నా వ్యక్తిగత జీవితానికి భంగం కల్గించేలా చేశారన్నారు. విచారణలో తాను అన్నింటికీ సమాధానాలు చెప్పానని, కానీ తనను మానసికంగా వేధింపులకు గురిచేయడానికే ఈ కేసును బనాయించారని ఆమె ఆరోపించారు. బీజేపీలో చేరితే వారిపై ఉన్న కేసులన్నీ మాయమయిపోతాయని కవిత తన లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు.


Tags:    

Similar News