Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు.. లిల్లీపుట్ నాయకుడంటూ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనుచాిత వ్యాఖ్యలు చేసిన వారిని కొందరు వెనకేసుకు వస్తున్నారన్ని అన్నారు. లిల్లీపుట్ నాయకుడు అంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై ఆమె మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో పార్టీని నాశనం చేసిన వాళ్లు తనపై బురద జల్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
లిల్లీపుట్ నాయకుడంటూ...
నల్లగొండలో చచ్చీచెడీ .. చావుతప్పి కన్నులొట్ట పోయి ఒక్కడే గెలిచారని అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నా బీఆర్ఎస్ నేతలు స్పందించలేదని అన్నారు. లిల్లీపుట్ నాయకుడు వల్లనే తనపై ట్రోల్స్ చేస్తున్నా స్పందించడం లేదన్నారు. నేడు కూడా జగదీశ్ రెడ్డి ఎర్రవెల్లి లోని ఫామ్ హౌస్ కు జగదీశ్వర్ రెడ్డి వెళ్లపోతున్నారు.