Kalvakuntla Kavitha : నేడు శాసనమండలిలో కల్వకుంట్ల కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు శాసనమండలిలో ప్రసంగించనున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు శాసనమండలిలో ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ కు గురి కావడంతో ఆమె తన రాజీనామాను ఆమోదించాలని ఇటీవల మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి కోరారు. అయితే తనకు తన రాజీనామాపై మాట్లాడేందుకు అవకాశమివ్వాలని కూడా కల్వకుంట్ల కవిత కోరారు.
రాజీనామాకు గల కారణాలు...
అయితే నేడు కల్వకుంట్ల కవిత శాసనమండలిలో ప్రసంగించే అవకాశాలున్నాయి. తన రాజీనామాకు గల కారణాలను కల్వకుంట్ల కవిత వివరించనున్నారు. ప్రధానంగా తనను పార్టీ ఎందుకు సస్పెన్షన్ చేసిన విషయమై కల్వకుంట్ల కవిత సభలో ఏం మాట్లాడతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. తిరిగి హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని ఆమె ప్రసంగం సాగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.