Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పిటీషన్ పై నేడు విచారణ

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Update: 2024-02-16 04:41 GMT

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ బెంచ్ విచారణ చేయనుంది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై అభ్యంతరం తెలుపుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అన్నింటినీ కలిపి...
నళినిచిదంబరం, సుమిత్ రాయ్ కేసులతో కవిత కేసును కూడా కలిపి సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు విచారించనుంది. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలవకుండా వారి ఇళ్లలోనే విచారణ చేయాలని పిటీషనర్లు కోరుతున్నారు. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వరసగా ఈడీ అధికారులు నోటీసులు ఇస్తున్నా కవిత హాజరు కావడం లేదు. ఈరోజు దీనిపై కీలక తీర్పు వెలువడే అవకాశముంది.


Tags:    

Similar News