పాడి కౌశిక్ రెడ్డి నేడు చేసే ఆరోపణలు ఎవరిపైన?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి న్యాయస్థానంలో ఊరట లభించింది. కౌశిక్ రిమాండ్ ను న్యాయస్థానం తిరస్కరించింది
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి న్యాయస్థానంలో ఊరట లభించింది. కౌశిక్ రిమాండ్ ను న్యాయస్థానం తిరస్కరించింది. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. క్వారీ యజమాని మనోజ్ ను హుజుూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బెదిరించారన్న ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేసిన సుబేదారీ పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయస్థానానికి తరలించారు. అ
రిమాండ్ తిరస్కరించడంతో...
యితే ఇది కక్ష సాధింపు చర్యగా పరిగణించాలని బీఆర్ఎస్ తరుపున న్యాయవాదులు వాదించారు. తొలుత ఎఫ్ఐఆర్ లో నాన్ బెయిల్ బుల్ సెక్షన్లు పెట్టలేదని, తర్వాత ఆ సెక్షన్లు మార్చి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారన్నారు. 41 ఎ నోటీసులు ఇవ్వకుండా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పారు. దీంతో కోర్లు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనికి సంబంధించి నేడు పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడతానని తెలిపారు. అన్ని విషయాలను వివరిస్తానని చెప్పారు.