విచారణకు హాజరైన పాడి కౌశిక్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మసాబ్ ట్యాంక్ పోలీసుల ఎదుట నేడు విచారణకు హాజరయ్యారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మసాబ్ ట్యాంక్ పోలీసుల ఎదుట నేడు విచారణకు హాజరయ్యారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగించారంటూ పాడి కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపేందుకు మసాబ్ ట్యాంక్ పోలీసులకు బాధ్యత అప్పగించారు.
నిన్ననే రావాల్సి ఉన్నా...
వాస్తవానికి నిన్ననే పాడి కౌశిక్ రెడ్డి మసాబ్ ట్యాంక్ పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే నిన్న కరీంనగర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో నేడు హాజరవుతానని చెప్పారు. ఈరోజు ఆయన మాసాబ్ ట్యాంక్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. దీంతో మసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డి స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేస్తున్నారు.