Koushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిగని శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ లోని సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడకు తరలించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిగ మనోజ్ అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించారన్న ఆరోపణలు వచ్చాయి.
వ్యాపారిని బెదిరించిన కేసులో...
అయితే దీనిపై అందిన ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుబేదారీ పోలీస్ స్టేషన్ లో తనపై నమోదయిన కేసును కొట్టేయాలిన కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో కౌశిక్ రెడ్డికి ఊరట లభించలేదు. కమలాపురం మండలం వంగపల్లిలో క్వారీని నిర్వహిస్తున్న మనోజ్ అనే వ్యాపారిని తనకు యాభై లక్షలు ఇవ్వాలంటూ బెదిరించారని మనోజ్ భార్య ఉమాదదవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. ఈరోజు కౌశిక్ రెడ్డిని విచారించి న్యాయస్థానంలో హాజరు పర్చనున్నారు.