BRS : హైదరాబాద్ ను యూటీగా చేసే కుట్ర

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు

Update: 2024-05-23 12:52 GMT

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ ను మన నుంచి వేరు చేసే ప్రయత్నం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ వాదులందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు.

ఉమ్మడి రాజధానిగా....
హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తున్నదని తెలిపారు. మరోవైపు ఏపీకి మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ చేయాలన్న ప్రయత్నమూ జరుగుతుందని అన్నారు. అందుకే కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణను కాపాడుకోగలదని ఆయన అన్నారు.


Tags:    

Similar News