BRS : ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలు.. అందుకేనా?
ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి బీఆర్ఎస్ నేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు.
ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి బీఆర్ఎస్ నేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై నేతలు కేసీఆర్ తో చర్చించే అవకాశముంది. ఇప్పటికే మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ ముగ్గురు నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయినట్లు చర్చిస్తునట్లు తెలిసింది.
కవిత ఎపిసోడ్ పై...
ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై నేతలు చర్చిస్తున్నట్టు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నిన్న లిల్లిపుట్ అంటూ జగదీశ్వర్ రెడ్డి పై కల్వకుంట్ల కవితచేసిన వ్యాఖ్యలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. కవిత కామెంట్స్ కు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.