సీబీఐ విచారణపై హైకోర్టుకు బీఆర్ఎస్

కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ఆపాలంటూ హైకోర్టును బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేసీఆర్ లు ఆశ్రయించారు.

Update: 2025-09-01 06:56 GMT

కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ఆపాలంటూ హైకోర్టును బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేసీఆర్ లు ఆశ్రయించారు. శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవకతవకలపై చర్చించిన అనంతరం సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఐకి అప్పగిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో నిందితులను శిక్షించాలన్నా, రాజకీయ కక్షలు అని విమర్శలు రాకూడకుండా ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.

చర్యలను నిలుపుదల చేయలేమని..
అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌, హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు చెప్పింది. కాళేశ్వరంపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించలేమి కూడా హైకోర్టు విచారణ సందర్భంగా వెల్లడించింది.


Tags:    

Similar News