Harish Rao : విచారణకు వెళ్లేముందు హరీశ్ ఏమన్నారంటే?

రాజకీయ దురుద్దేశ్యంతోనే కాళేశ్వరం కమిషన్ ను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు.

Update: 2025-06-09 03:46 GMT

రాజకీయ దురుద్దేశ్యంతోనే కాళేశ్వరం కమిషన్ ను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. తమ పార్టీపై లేని పోని నిందలు మోపడానికి మాత్రమే ఈ కమిషన్ ను ఏర్పాటు చేసిందన్న ఆయన తాను న్యాయవ్యవస్థను గౌరవించే వ్యక్తిగా కమిషన్ ఎదుట హాజరై తన వద్ద ఉన్న సమాచారాన్ని అందిస్తామని హరీశ్ రావు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో...
కొందరు రాజకీయ నేతలు ఆరోపిస్తున్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదన్న ఆయన అన్నీ అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే తాము అక్కడి నిర్మించాల్సి వచ్చిందని హారీశ్ రావు చెప్పారు. కమిషన్ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తన వద్ద ఉన్న డాక్యుమెంట్లను కూడా సమర్పిస్తానని ఆయన మీడియాకు చెప్పారు.


Tags:    

Similar News