Harish Rao : ఇదిగో నా రాజీనామా లేఖ.. రేపు అక్కడకు వస్తా
బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు.
harish rao, former minister, bjp, congress
బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. తాను రేపు అమరవీరుల స్థూపం వద్దకు వస్తున్నానని చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా రావాలన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీతో పాటు గ్యారంటీలను కూడా అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, మళ్లీ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని తెలిపారు.
ఇద్దరి రాజీనామాలు...
ఒకవేళ అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇద్దరి రాజీనామాలను మేధావుల వద్ద ఉంచుదామని, ఆగస్టు 15వ తేదీ తర్వాత ఎవరు రాజీనామా చేయాల్సి వస్తుందో తేలిపోతుందని ఆయన సవాల్ విసిరారు. రాజీనామా లేఖతో రేపు అమరవీరుల స్థూపం దగ్గరికి వస్తావా? అని ఛాలెంజ్ విసిరారు.