KCR : కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్

కాళేశ్వరం కమిషన్ ఎదుటకు విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు

Update: 2025-05-27 14:00 GMT

కాళేశ్వరం కమిషన్ ఎదుటకు విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. జూన్ నెల 5వ తేదీన కమిషన్ ఎదుట హాజరు కావాలని కమిషన్ ఇచ్చిన నోటీసులు జారీచేసింది. అయితే ఈ విచారణకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్న దానికిసంబంధించి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. పార్టీలోని సీనియర్ నేతలకు కేసీఆర్ సమాచారం ఇచ్చారు.

జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఎదుటకు...
కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దయెత్తున అవినీతి జరిగిందని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ కేసీఆర్, ఈటల రాజేందర్, హరీశ్ రావులకు నోటీసులు జారీ చేసింది. జూన్ ఆరో తేదీన ఈటల రాజేందర్, 9వ తేదీన హరీశ్ రావు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే కేసీఆర్ హాజరవుతుండటంతో హరీశ్ రావు కూడా హాజరు కానున్నారు. కమిషన్ ఎదుట హాజరయి ప్రశ్నలకు నేరుగా కేసీఆర్ సమాధానం చెప్పాలని నిర్ణయించినట్లు తెలిసింది


Tags:    

Similar News