BJP : కేసీఆర్ పై రాజాసింగ్ అన్న మాటలు వింటే?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సంబంధించి రాజాసింగ్ ఇటు కాంగ్రెస్ అటు కేసీఆర్ పైన తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తన ప్రసంగంలో అన్నీ అబద్ధాలే మాట్లాడారని, కేసీఆర్ అంటే జూటా, మోదీ ప్రధానిగా ఉన్నప్పుడు పొగిడావని, అప్పుడు నిధుల గురించి ఎందుకు అడగలేదని నిలదీశారు. నాడు భయపడే జంకినట్లున్నావు అంటూ కేసీఆర్ పై సెటైర్ వేశారు. కేసీఆర్ చెప్పేవన్ని పచ్చి అబద్ధాలు అని, తెలంగాణ ప్రజలు వాటిని నమ్మడం మానేశారన్నారు.
ఫామ్ హౌస్ లోకి వెళ్లి...
అసెంబ్లీలో నాడు తెలంగాణకు పది లక్షల కోట్ల రూపాయల నిధులు వచ్చాయని చెప్పిన కేసీఆర్ నేడు ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదని అనడం పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్న రాజాసింగ్, దురదృష్టం కొద్దీ బీజేపీ వాళ్లు కరెక్ట్ గా లేరని, మానాయకులు కరెక్ట్ గా ఉంటే మొన్నటి ఎన్నికల్లోనే బీజేపీ అధికారంలోకి వచ్చేదని రాజాసింగ్ సొంత పార్టీపై కూడా మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి గురించి మర్చిపోయి మళ్లీ ఫామ్ హౌస్ కు పోయి పడుకోవాలని రాజాసింగ్ కేసీఆర్ కు హితవు పలికారు.