BJP : గవర్నర్ వద్దకు బీజేపీ నేతలు.. ఫోన్ ట్యాపింగ్ కేసును

ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు

Update: 2024-04-06 07:38 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ నేతృత్వంలో బృందం గవర్నర్ ను కలసి వినతిపత్రాన్ని సమర్పించింది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుందని, ఈ కేసులో అనేక మంది అధికారులు అరెస్టయ్యారన్నారు. ఎవరెవరి ఫోన్లను గత ప్రభుత్వంలో ట్యాప్ చేశారో బయటపెట్టాలంటూ లక్ష్మణ్ గవర్నర్ ను కలసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.

సీబీఐకి అప్పగిస్తేనే...
ఫోన్ ట్యాపింగ్ కు ఎవరు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. అందుకు సీబీఐకి ఈ కేసును అప్పగిస్తేనే అసలు దోషులు బయటపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం అత్యంత దారుణమని అన్నారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యవహారం నడిచిందన్న వార్తలు కలవరపెడుతున్నాయన్నారు. సీబీఐకి ఈ కేసును అప్పగించినప్పుడే న్యాయం జరుగుతుందని కె. లక్షణ్ అన్నారు. ప్రభుత్వం కూడా సీబీఐకి అప్పగించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.


Tags:    

Similar News