తెలంగాణ సీఎం మార్పుపై బీజేపీ నేత సంచలన కామెంట్స్
బీజేపీ నేత మహేశ్వరరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇన్ ఛార్జిని మార్చిన కాంగ్రెస్ అధిష్టానం ఇక ముఖ్యమంత్రిని మారుస్తుందన్నారు
బీజేపీ నేత మహేశ్వరరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇన్ ఛార్జిని మార్చిన కాంగ్రెస్ అధిష్టానం ఇక ముఖ్యమంత్రిని మారుస్తుందన్నారు. మిషన్ సీఎం ఛేంజ్ బాధ్యతను మీనాక్షి నటరాజన్ కు అప్పగించారని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ ఇన్ ఛార్జి మారారంటే ఇక మారేది ముఖ్యమంత్రేనంటూ ఆయన సంచలన వ్య్యాఖ్యలు చేశారు.
డిసెంబరు నెలలోపు...
ఢిల్లీ నుంచి వచ్చిన ఆడబిడ్డ ఆశీర్వాదం ఉంటేనే ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి కొనసాగుతారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో వ్యవహారాలు కథలుకథలుగా నడుస్తున్నాయన్న ఆయన యు ట్యాక్స్, బీ ట్యాక్స్, ఇతర ట్యాక్స్ లతో ఆ పార్టీలో చర్చ నడుస్తుందని , డిసెంబరు నెలలోపు ముఖ్యమంత్రి మారడం ఖాయమని మహేశ్వర్ రెడ్డి అన్నారు.