Breaking : రాజాసింగ్ కు షాకిచ్చిన బీజేపీ
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భారతీయ జనతా పార్టీ షాకిచ్చింది. రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భారతీయ జనతా పార్టీ షాకిచ్చింది. రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల బీజేపీ అధ్యక్ష పదవి కోసం రాజాసింగ్ తాను కూడా పోటీ చేసేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిప్పడు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారంటూ ఆయన పార్టీకి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా లేఖ సమర్పించారు.
రాజీనామా లేఖ ఆమోదం...
తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి ఇచ్చారు. అయితే రాజాసింగ్ రాజీనామా లేఖను రాష్ట్ర నాయకత్వం బీజేపీ కేంద్ర నాయకత్వానికి పంపింది. రామచందర్ రావు ఎంపికపై కూడా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచన మేరకు రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది.