BRS : ఉప రాష్ట్రపతి ఎన్నికలలో కేసీఆర్ కీలక నిర్ణయం

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి భారత రాష్ట్రసమితి కీలక నిర్ణయం తీసుకుంది

Update: 2025-09-08 04:18 GMT

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి భారత రాష్ట్రసమితి కీలక నిర్ణయం తీసుకుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. నోటా అవకాశం కూడా లేకపోవడంతో రెండు కూటములకు సంబంధించిన అభ్యర్థులకు ఓటు వేయడం ఇష్టం లేక ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

ఎన్నికకు దూరంగా...
బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు. వీరంతా ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇటు కాంగ్రెస్ కూటమి తరుపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి, అటు ఎన్డీఏ కూటమి తరుపున రాధాకృష్ణన్ లకు ఓటు వేయడం ఇష్టం లేని తాము ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. నిన్న కీలక నేతలతో సమావేశమైన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.


Tags:    

Similar News