భద్రాచలానికి వరద ముప్పు

భద్రాచలానికి వరద ముప్పు పొంచి ఉంది. అధికారులు కూడా టెన్షన్ పడుతున్నారు

Update: 2022-07-14 07:51 GMT

భద్రాచలానికి వరద ముప్పు పొంచి ఉంది. అధికారులు కూడా టెన్షన్ పడుతున్నారు. ఈ సాయంత్రానికి భద్రాచలానికి రాకపోకలు బంద్ అయ్యే అవకాశాలున్నాయి. కొత్తగూడెం లింకు రోడ్డు తెగిపోయే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. కొత్తగూడెం - భద్రాచలం రోడ్డు మార్గం తెగిపోతే ఆ ప్రాంతానికి రాకపోకలన్నీ పూర్తిగా నిలిచిపోతాయి. ఇప్పటికే భద్రాచలంలోని ఇళ్లల్లోకి వరద నీరు ప్రవేశించింది.

సాయంత్రం నుంచి....
భద్రాచలం బ్రిడ్జిపైన ఈ సాయంత్రం నుంచి రాకపోకలు బంద్ చేయనున్నారు. 48 గంటల పాటు బ్రిడ్జిపై రాకపోకలను బంద్ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భద్రాచలం ప్రాంతంలో 144వ సెక్షన్ విధించారు. ఆలయ సమీపంలోని అన్నదాన సత్రం వరకూ వరద నీరు చేరుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 64 అడుగుల మేరకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి పై మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.


Tags:    

Similar News