Breaking : బీసీ రిజర్వేషన్ల విచారణ రేపటికి వాయిదా

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Update: 2025-10-08 11:21 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు తిరిగి విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఈవిచారణ చేపట్టింది. జాగృతి రెడ్డి సంస్థ తరుపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. రిజర్వేషన్ కు సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందా? అని న్యాయమూర్తి అడగగా, అందుకు ఉభయ సభల ఆమోదం లభించిందని తెలిపారు.ఎప్పుడు బిల్లు ఆమోదం పొందిందని న్యాయమూర్తి ప్రశ్నించగా, ఆగస్టు 11వ తేదీన బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందిందని న్యాయవాదులు వివరించారు. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకనే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉందని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు తెలిపారు.

ఇరువర్గాల వాదనలు విన్న...
రిజర్వేషన్లు యాభై శాతం దాటనివ్వకుండా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశాలను ఈ సందర్భంగా న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా, బిల్లును గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని, చేయకూడదని ఇంప్లీడ్ పిటీషన్లు వేశారు. రిజర్వేషన్లు యాభై శాతం దాటితే నోటిఫికేషన్ విడుదలయినా ఎన్నికలు రద్దవుతాయని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని న్యాయవాదులు తెలిపారు. ఎన్నికలను ఆపడం తమ ఉద్దేశ్యం కాదని, చట్టబద్ధంగానే ఎన్నికలు నిర్వహించాలని మాత్రమేనని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై ఇరువర్గాల వాదనలు సుదీర్ఘంగా విన్న న్యాయస్థానం చివరకు రేపటికి వాయిదా వేసింది. రేపటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుండటంతో దీనిపై స్టే ఇవ్వాలని కోరగా, దానికి హైకోర్టు తిరస్కరించింది.


Tags:    

Similar News