Telangana : బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్

బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది

Update: 2025-10-14 04:40 GMT

బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం సోమవారం అర్ధరాత్రి పిటీషన్ దాఖలు చేసింది. యాభై శాతం రిజర్వేషన్లు పరిమితి నియమమే తప్ప రాజ్యాంగ పరమైనది కాదని పిటిషన్ లో పేర్కొన్న ప్రభుత్వం , రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధింపు రాజ్యాంగంలో ఎక్కడా లేదని ప్రభుత్వం పిటీషన్ లో పేర్కొంది.

ఒకటి రెండు రోజుల్లో...
తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ పై ఒకటి రెండు రోజుల్లో విచారణ జరిగే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఈ శనివారం నుంచి పది రోజులపాటు సుప్రీంకోర్టుకు వరుస సెలవులు ఉండటంతో ఈ పిటీషన్ పై ఈలోపు విచారణ చేయాలని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిలిచిపోవడంతో సుప్రీంకోర్టులో ఎప్పుడు విచారణకు వస్తుందన్నది చర్చనీయాంశమైంది.


Tags:    

Similar News