Supreme Court : నేడు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పై విచారణ
బీసీ రిజర్వేషన్ల పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
బీసీ రిజర్వేషన్ల పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నేడువిచారణ జరగనుంది. జస్టిస్ విక్రమ్ నాధ్ ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. బీసీ రిజర్వేషన్లు యాభై శాతం దాటాయని చెబుతూ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 9ని కొట్టివేసింది.
పాత విధానంలోనే ఎన్నికలను...
స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ హైకోర్టు తీర్పుతో నిలిచిపోయాయి. పాత రిజర్వేషన్ల విధానంలోనే ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. అభిషేక్ సింఘ్వి ఈ కేసును వాదించనున్నారు. ఈ కేసు నేడు విచారణకు వస్తుండటంతో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్న ఆసక్తి నెలకొంది.