Telangana : తెలంగాణలో కొనసాగుతున్న బంద్

తెలంగాణలో జరుగుతున్న బంద్ విజయవంతంగా కొనసాగుతుంది

Update: 2025-10-18 04:26 GMT

తెలంగాణలో జరుగుతున్న బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపుతో ఉదయం ప్రారంభమైన బంద్ సక్సెస్ గా కొనసాగుతుంది. అన్ని పార్టీల నేతలు కూడా పాల్గొనడంతో బంద్ ప్రభావం పూర్తి స్థాయిలో కనపడుతుంది.

ప్రయాణికుల అవస్థలు...
ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ బంద్ ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. బస్సులు డిపోలకే పరిమితమవ్వడంతో ప్రయాణికులు డిపోల్లోనే వేచి చూస్తున్నారు. దీంతో ఆటోలు, క్యాబ్ లు ధరలు పెంచి వసూలు చేస్తున్నారు. అన్ని ప్రజాసంఘాలు కూడా మద్దతు ప్రకటించడంతో పాటు మంత్రులు కూడా బంద్ లో పాల్గొనడంతో బంద్ అంతటా శాంతియుతంగా పూర్తిగా జరుగుతుంది.


Tags:    

Similar News