Telangana Bandh : నేడు తెలంగాణ బంద్

తెలంగాణ వ్యాప్తంగా నేడు బంద్ ప్రారంభమయింది

Update: 2025-10-18 01:37 GMT

తెలంగాణ వ్యాప్తంగా నేడు బంద్ ప్రారంభమయింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాల జేఏసీ పిలుపు నిచ్చింది. ఈ పిలుపుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు వామపక్ష పార్టీలు కూడా బంద్ కు మద్దతు ప్రకటించాయి. దీంతో ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి.

అన్ని రాజకీయ పార్టీలు...
రాజకీయ పార్టీలతో పాటు వివిధ సంఘాలు కూడా బంద్ కు మద్దతు ప్రకటించడంతో బంద్ ప్రభావం ఉదయం నుంచి కనిపిస్తుంది. ఈరోజు ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు కూడా మూతపడనున్నాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.బంద్ ను శాంతియుతంగా నిర్వహించు కోవాలని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాణిజ్య, వ్యాపారాలు కూడా స్వచ్ఛందంగా బంద్ ను పాటించనున్నాయి.


Tags:    

Similar News