రేవంత్ రెడ్డికి బీసీ సంఘాల ధన్యవాదాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సంఘాల కృతజ్ఞతలు తెలియజేశాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సంఘాల కృతజ్ఞతలు తెలియజేశాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీసీ సంఘాల నాయకులు ఈ సందర్భంగా రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.కేబినెట్ సమావేశంలో బీసీలకు రిజర్వేషన్ పై తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని తెలిపారు.
42 శాతం రిజర్వేషన్లు...
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బీసీ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలుపర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్. కృష్ణయ్య, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, బీసీ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.