కృష్ణా జలాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కృష్ణా జలాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2026-01-08 07:25 GMT

కృష్ణా జలాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీ జరుగుతుందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడింది అన్నీ అబద్ధాలేనని బండి సంజయ్ అన్నారు. పోతిరెడ్డి పాడు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నోరు మెడటం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్ల రూపాయలు వ్యయం చేసినా, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పధకానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా చుక్క నీరు కూడా ఒక్క ఎకరానికి అందలేదని బండి సంజయ్ ఆరోపించారు.

నీటి కేటాయింపులపై...
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నీటి కేటాయింపులపై మాట్లాడటం లేదని బండి సంజయ్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండగా ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణకు నీటి కేటాయింపులు లెక్క ప్రకారం జరగాల్సిందేనని బండి సంజయ్ అన్నారు. తాము నదీజలాలపై యుద్ధం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ ఫీల్డ్ లోనే లేదన్నారు. కేసీఆర్ ప్రకటనలకే పరిమితమయ్యారన్న బండి సంజయ్ ప్రజల దృష్టి మరల్చడానికే బీఆర్ఎస్, కాంగ్రెస్ లు డ్రామాలాడుతున్నాయని బండి సంజయ్ అన్నారు.


Tags:    

Similar News