నల్లగొండలో బండి సంజయ్ ప్రెస్ మీట్

బీజేపీ నేత బండి సంజయ్ నల్లగొండలో ప్రెస్ మీట్ నిర్వహించి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.

Update: 2025-02-09 10:04 GMT

నల్లగొండలో బండి సంజయ్ ప్రెస్ మీట్ – బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శలు

బీజేపీ నేత బండి సంజయ్ నల్లగొండలో ప్రెస్ మీట్ నిర్వహించి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు అభ్యర్థులే లేరని, మూడు స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ నేతలపై కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఈ-ఫార్ములా వంటి కేసులు లేకుండా కాంగ్రెస్‌తో ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తోందని, ఇది ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు.

ఇక కాంగ్రెస్ నేతలు ప్రచారానికి వస్తే నిరుద్యోగ భృతి, నోటిఫికేషన్‌లు ఏమయ్యాయి? అని గల్లా పట్టి నిలదీయాలని ప్రజలను కోరారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తుందని బండి సంజయ్ తెలిపారు.

Tags:    

Similar News