Telangana : నేటి నుంచి ఆషాఢ మాసం బోనాలు

తెలంగాణలో నేటి నుంచి ఆషాఢ మాసం బోనాలు ప్రారంభం కానున్నాయి.

Update: 2025-06-26 04:02 GMT

తెలంగాణలో నేటి నుంచి ఆషాఢ మాసం బోనాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు గోల్కొండ జగదాంబ అమ్మవారికి మొదటి బోనం ను సమర్పించనున్నారు. ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే బోనాలు నేటి నుంచి ప్రారంభం కానుండటంతో రాష్ట్రంలో పండగ వాతావరణం సంతరించుకుంటుంది. ఆదిపరాశక్తి అమ్మలగమ్మ అమ్మకి బోనం సమర్పించడానికి మహిళలు దేవాలయాలకు తరలివస్తారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల విన్యాసాలతో నేటి నుంచి నెల రోజుల పాటు బోనాల పండగ జరగనుంది.

దశాబ్దాల చరిత్ర గల...
దశాబ్దాల చరిత్ర ఉన్న బోనాల జాతర తెలంగాణ సంస్కృతిలో భాగమై నేటి వరకూ కొనసాగుతుంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా ఈ నెల రోజులు పండగలా జరుపుకుంటారు. అత్యంత భక్తి ప్రపత్తులతో అమ్మవారిని కుటుంబంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. జులై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు జరగనున్నాయి. దీనిని లష్కర్ బోనాలు అంటారు. జులై 21వ తేదీన లాల్ దర్వాజా బోనాలు నిర్వహిస్తారు. 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బోనాల పండగకు ప్రభుత్వం అన్ని దేవాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.


Tags:    

Similar News