Karthika Masam : నేడు ఆఖరి సోమవారం... కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో నేడు శైవ క్షేత్రాలు భక్తులతో కిటికిటలాడిపోతున్నాయి

Update: 2023-12-11 03:27 GMT

kartika masam

కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో నేడు శైవ క్షేత్రాలు భక్తులతో కిటికిటలాడిపోతున్నాయి. కార్తీక సోమవారం భక్తులు పుణ్యదినంగా భావిస్తారు. ఈ ఏడాది ఇదే ఆఖరి కార్తీక సోమవారం కావడంతో అధిక మంది భక్తులు శైవ క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. దీంతో శ్రీశైలం వంటి ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే నదుల్లో స్నానమాచరించి భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు.

ప్రత్యేక పూజలు...
శివుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు ఉన్న వారంతా భక్తి శ్రద్ధలతో ఈ నెలంతా పూజలు చేస్తారు. దైవ ప్రార్థనలతో కాలం గడుపుతారు. మాంసాహారం జోలికి పోరు. పూర్తిగా శాఖాహార భోజనం తిని భక్తులు దైవ దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తారు. శివుడిని ఈ మాసంలో అభిషేకిస్తే కోరికలు నెరవేరతాయన్న నమ్మకంతో ఈ నెలంతా పూజలు చేసేవారు కోకొల్లలుగా కనిపిస్తారు. ఈరోజు ఆఖరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలు భక్తులతో కళకళలాడిపోతున్నాయి.


Tags:    

Similar News