Bhadrachalam : భద్రాద్రిలో నేడు ఎదురుకోలు వేడుక

శ్రీరామనవమికి భధ్రాచలంలో అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు సీతారాముల కల్యాణం జరగనుంది.

Update: 2024-04-16 05:27 GMT

శ్రీరామనవమికి భధ్రాచలంలో అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు సీతారాముల కల్యాణం జరగనుంది. అయితే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా నేడు ఎదరుకోలు ఉత్సవాన్ని పండితులు నిర్వహిస్తున్నారు. భద్రాద్రిలోని రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదురుకోలు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. రేపు మిధిలా స్టేడియంలో సీతారామ కల్యాణం జరగనుంది.

రేపు సీతారామ కల్యాణం...
సీతారామ కల్యాణం సందర్భంగా పెద్దయెత్తున భక్తులు భద్రాద్రికి చేరుకుంటున్నారు. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లు ఇప్పటికే భద్రాద్రి బాట పట్టారు. భద్రాచలంలోని అన్ని వసతి గృహాలు బుక్ అయి పోయాయి. సీతారామలు కల్యాణాన్ని తిలకించేందుకు ఎక్కువ మంది భక్తులు వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉండటం, వడగాల్పులు వీస్తుండటంతో అందుకు తగినట్లు చర్యలు ఆలయ అధికారులు తీసుకున్నారు.


Tags:    

Similar News