KTR : కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు

ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు

Update: 2025-05-27 01:52 GMT

KTR Writes Open Letter Urging Protection of 400 Acres of HCU Forest Land from Environmental Destruction

ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాను ఈ కేసులో సహకరిస్తానని, తనకు రెండోసారి ఏసీబీ అధికారుల నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో పోస్టు చేశారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తాను విచారణకు సహకరిస్తానని కేటీఆర్ తెలిపారు.

పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత...
అయితే తాను ముందుగా నిర్ణయించుకున్న యూకే, అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతాననిఆయన తెిపారు. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఒకసారి ఏసీబీ అధికారులు విచారణ చేశారు. యాభై కోట్లు విదేశీ సంస్థలకు మంత్రివర్గం ఆమోదం లేకుండా హెచ్ఎండీఏ కు చెందిన నిధులను మళ్లించారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.


Tags:    

Similar News